కరోనా వాక్సిన్ తయారీ దిశగా చైనా కీలక ముందడుగు... మనుషులపై రెండో దశ ప్రయోగాలు మొదలు!
- టీకాను అభివృద్ధి చేస్తున్న కాన్సినో బయోలాజిక్స్
- 84 ఏళ్ల వ్యక్తి సహా 500 మంది వాలంటీర్ల నియామకం
- టీకా సమర్థతపై దృష్టిని సారించిన శాస్త్రవేత్తలు
కరోనాను అంతమొందించే దిశగా, చైనా మరో కీలక ముందడుగు వేసింది. తొలి దశ క్లినికల్ ట్రయల్స్ ను విజయవంతం చేసిన స్వదేశీ సంస్థ కాన్సినో బయోలాజిక్స్ ఐఎన్సీ, ఇప్పుడు రెండవ దశ క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించిన 'గ్లోబల్ టైమ్స్' సుమారు 500 మంది వాలంటీర్లను ట్రయల్స్ కోసం నియమించుకున్నట్టు పేర్కొంది. వీరిలో వూహాన్ కు చెందిన 84 ఏళ్ల వ్యక్తి కూడా ఉన్నారని పేర్కొంది.
కాగా, కాన్సినో బయోలాజిక్స్, తన తొలి దశ పరీక్షల్లో తాము తయారు చేస్తున్న టీకా భద్రతపై దృష్టిని సారించింది. ఇక, రెండో దశలో టీకా ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందన్న విషయంపై దృష్టిని సారించామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మేజర్ జనరల్ చిన్ వెయ్ నేతృత్వంలోని బృందం టీకా తయారీ కృషిలో నిమగ్నమైన సంగతి తెలిసిందే.