అభిమానులు లేకుండా టీ20 ప్రపంచకప్పా?: ఊహించుకోలేనన్న బోర్డర్
- క్రీడారంగంపై కరోనా పంజా
- ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్
- స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ లు నిర్వహించాలనే ప్రతిపాదన
కరోనా వైరస్ దెబ్బకు క్రీడారంగం మొత్తం స్తంభించిపోయింది. ఒలింపిక్స్ వంటి మేజర్ ఈవెంట్ కూడా కరోనా కారణంగా వాయిదా పడింది. క్రికెట్ టోర్నీలు, సీరీస్ లు కూడా ఆగిపోయాయి. మరోవైపు ఈ ఏడాది అక్టోబర్ లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ పై కూడా నీలి మేఘాలు కమ్ముకున్నాయి. అయితే, స్టేడియంలలోకి ప్రేక్షకులను అనుమతించకుండా... ఖాళీ స్టేడియాలలో మ్యాచ్ లను నిర్వహించాలనే ప్రతిపాదన ఉంది. ప్రేక్షకులు కేవలం మ్యాచ్ టెలికాస్ట్ ను మాత్రమే చూస్తారన్నమాట. అయితే, ఈ ప్రతిపాదనపై ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కెప్టెన్ అలెన్ బోర్డర్ పెదవి విరిచారు.
ఖాళీ స్టేడియంలలో క్రికెట్ మ్యాచ్ లను అస్సలు ఊహించుకోలేకపోతున్నానని బోర్డర్ అన్నారు. ఈ ప్రతిపాదనను తాను ఒప్పుకోలేనని చెప్పారు. స్టేడియంలో ప్రేక్షకులు లేకపోతే ఆ మ్యాచ్ కు అర్థం ఉండదని... ఇది జరగకూడదనే తాను కోరుకుంటున్నానని తెలిపారు. పరిస్థితి అదుపులోకి రాకపోతే టోర్నీని రద్దు చేసి... మరో సురక్షిత ప్రాంతంలో నిర్వహించాలని సూచించారు.