విశాఖలో ఉన్న జపనీయులు బెంగళూరుకు తరలింపు!
- మార్చి 23 నుంచి వైజాగ్ లో ఉండిపోయిన జపాన్ పౌరులు
- ఛార్టెడ్ ఫ్లైట్ లో బెంగళూరుకు తరలింపు
- అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో జపాన్ కు వెళ్లనున్న వైనం
విశాఖలో ఉన్న ఆరుగురు జపాన్ పౌరులను అధికారులు నిన్న ఉదయం బెంగళూరుకు పంపించారు. మార్చి 23 నుంచి లాక్ డౌన్ సమయంలో వీరు విశాఖలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వీరిని ఒక ఛార్టెడ్ ఫ్లైట్ ద్వారా బెంగళూరుకు పంపించారు. అక్కడ ఇతర జపనీయులతో వారు జతకలుస్తారు. అనంతరం అక్కడి నుంచి అందరూ కలిసి ఒక ప్రత్యేక విమానంలో జపాన్ బయల్దేరుతారు. ఈ ప్రత్యేక విమానాన్ని జపాన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
ఈ సందర్భంగా విశాఖ ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ రాజ్ కిశోర్ మీడియాతో మాట్లాడుతూ, నిన్న ఉదయం 10.35 గంటలకు ఎయిట్ సీటర్ ఛార్టెడ్ ఫ్లయిట్ లో జపాన్ పౌరులను బెంగళూరుకు పంపించామని చెప్పారు. లాక్ డౌన్ నేపథ్యంలో వారు విశాఖలోనే చిక్కుకుపోయారని తెలిపారు. ఈ రాత్రి వారంతా బెంగళూరు నుంచి జపాన్ కు వెళ్లిపోతారని చెప్పారు.