ఏపీలో ఏడుకు చేరిన మరణాలు.. 439కి పెరిగిన కేసులు

  • నిన్న గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో చెరో నాలుగు కేసుల నమోదు
  • 93 కేసులతో గుంటూరు అగ్రస్థానం
  • విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోకి ప్రవేశించని వైరస్
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న కొత్తగా మరో 12 కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 439కి పెరిగింది. నిన్న కొత్తగా గుంటూరులో 4, నెల్లూరు 4, చిత్తూరులో 2, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చెరోటి చొప్పున కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలుపుకుని గుంటూరులో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 93కి పెరిగింది.

ఇక, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో 93 కేసులు ఒక్క గుంటూరులోనే నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇదే అత్యధికం. ఆ తర్వాతి స్థానంలో కర్నూలు (84) నెల్లూరు (56) ఉన్నాయి. అత్యల్పంగా అనంతపురంలో 15 కేసులు నమోదు కాగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.


More Telugu News