లాక్ డౌన్ ప్రభావంపై ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం జగన్
- రేపటితో ముగియనున్న 21 రోజుల లాక్ డౌన్
- వివిధ రంగాల తీరుతెన్నులను ప్రధానికి నివేదించిన ఏపీ సీఎం
- చేపట్టాల్సిన చర్యలపై విజ్ఞప్తి
దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ రేపటితో ముగియనుంది. దేశం యావత్తు రేపు ప్రధాని ఏంచెబుతారన్న దానిపై ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. వివిధ రంగాలపై లాక్ డౌన్ ప్రభావాన్ని నివేదించారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో చేపట్టాల్సిన చర్యలపై ప్రధానికి విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో అనేక రాష్ట్రాల సీఎంలు లాక్ డౌన్ ను ఈ నెలాఖరు వరకు పొడిగించారు. అయితే ఏపీలో పరిస్థితిపై అనిశ్చితి నెలకొంది. లాక్ డౌన్ ను కొనసాగించకపోవచ్చని, జోన్ల వారీగా ఆంక్షలు విధించేందుకు సీఎం జగన్ మొగ్గుచూపవచ్చని ప్రచారం జరుగుతోంది.