‘కరోనా’ కేసుల పెరుగుదల నేపథ్యంలో... గుంటూరు కలెక్టర్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ
- రోజు విడిచి రోజు మాత్రమే నిత్యావసరాల కొనుగోలు
- సరిసంఖ్య తేదీల్లో నిత్యావసరాలు కొనుగోలు చేయాలి
- బేసి సంఖ్య తేదీల్లో దుకాణాలు మూసివేయాలి
గుంటూరులో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలు రోజు విడిచి రోజు మాత్రమే నిత్యావసరాలు కొనుగోలు చేయాలని సూచించారు. సరి సంఖ్య తేదీల్లో మాత్రమే సరుకులు కొనుగోలు చేయాలని, బేసి సంఖ్య తేదీల్లో నిత్యావసరాలు విక్రయించే దుకాణాలు మూసివేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 439కి చేరింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలతో పోలిస్తే గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా 93 కేసులు నమోదయ్యాయి. గుంటూరు తర్వాత కర్నూలు జిల్లాలోనే అధికంగా 84 కేసులు నమోదు అయ్యాయి.