ఏపీ సీఎం సహాయ నిధికి హెటిరో గ్రూప్ రూ.5 కోట్ల విరాళం

  • సీఎం జగన్ ని  కలిసిన హెటిరో గ్రూప్ ఎండీ వంశీకృష్ణ
  • రూ.5 కోట్ల విరాళం చెక్కు అందజేత
  • ‘కరోనా’పై పోరాటానికి విరాళమిచ్చిన టీటీడీ ఉద్యోగులు
కరోనా వ్యాప్తి నిరోధక చర్యలకు తమ వంతుగా ఏపీ సీఎం సహాయ నిధికి హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రూ.5 కోట్ల విరాళం అందజేశాయి. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ని హెటిరో డ్రగ్స్ గ్రూప్ ఎండీ వంశీ కృష్ణ కలిసి విరాళం చెక్కును అందజేశారు. ఈ చెక్కుతో పాటు పీపీఈ కిట్స్, మందులు, మాస్క్ లు కూడా అందజేశారు.

ఈ సందర్భంగా ‘హెటిరో’ గ్రూప్ ప్రతినిధులు మాట్లాడుతూ,  విశాఖ జిల్లా కలెక్టర్ కు సీఎస్ ఆర్ ఫండ్స్ అందజేశామని, దీంతో పాటు నక్కపల్లిలో శానిటైజేషన్, మందులు, నిత్యావసరాల సరుకుల పంపిణీకి మరో రెండు కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చామని చెప్పారు.

‘కరోనా’పై పోరాటం నిమిత్తం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉద్యోగులు కూడా తమ ఒక్క రోజు వేతనం రూ. 83 లక్షల 86 వేల 747 విరాళంగా ఇచ్చారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి,  ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఈరోజు జగన్ ని కలిసి విరాళం చెక్కును అందజేశారు.


More Telugu News