విదేశీయుల వీసాలపై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం

  • కరోనా కారణంగా భారత్ లో చిక్కుకుపోయిన విదేశీయులు
  • ఏప్రిల్ 30 వరకు వీసాల పొడిగింపు
  • ఎలాంటి రుసుము వసూలు చేయబోమని వెల్లడి
కరోనా రక్కసి విజృంభణతో ఎక్కడివాళ్లు అక్కడే నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. భారత్ లోనూ అనేక దేశాలకు చెందిన వారు చిక్కుకుపోయారు. వారిలో కొందరి వీసాల కాలపరిమితి ముగుస్తుండడంతో ఇమ్మిగ్రేషన్ ఇబ్బందులు రాకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

విదేశీయుల వీసాలను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకు ఎలాంటి రుసుము వసూలు చేయడంలేదని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 30వ తేదీ మధ్యలో గడువు తీరిపోయే అన్ని వీసాలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని, విదేశీయులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏప్రిల్ 30 వరకు భారత్ లో ఉండొచ్చని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలపై తీవ్ర ఆంక్షలు ఉండడంతో అన్ని దేశాల ప్రజలు ఇతర దేశాల్లో నిలిచిపోయారు.


More Telugu News