నిజం చెప్పాలంటే నాకు నటనపై ఆసక్తి ఉండేది కాదు: నటుడు రావు రమేశ్

  • దర్శకుడిని కావాలని ఉండేది
  • చాలా కష్టమంటూ అమ్మ వారించింది
  • అమ్మ మాట విన్నానన్న రావు రమేశ్  
తెలుగులో ప్రతినాయక పాత్రలతోను .. కీలకమైన పాత్రలతోను రావు రమేశ్ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. విలక్షణమైన బాడీ లాంగ్వేజ్ తో ఆయన కనబరిచే డైలాగ్ డెలివరీ ఆయనకి ఆ ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. వరుస సినిమాలతో బిజీగా వున్న ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి చెప్పారు.

"మొదటి నుంచి కూడా నాకు దర్శకుడిని కావాలనే ఉండేది. నటుడిని కావాలని ఎప్పుడూ అనుకోలేదు .. దానిపై పెద్దగా ఆసక్తి కూడా ఉండేది కాదు. నేను దర్శకుడిని అవుతానని మా అమ్మతో చెప్పాను. 'అదంత తేలికైన పని కాదురా .. చాలా కష్టం. చాలా విషయాలపైన చాలా అవగాహన ఉండాలి. దానికంటే నటనే తేలిక .. నువ్వు నటనవైపే వెళ్లు. ఎందుకనో నువ్వు నటనలోనే రాణిస్తావని అనిపిస్తోంది' అని అంది. అమ్మమాట కదా .. విన్నాను. అందుకే ఇప్పుడు ఈ స్థాయిలో వున్నాను" అని చెప్పుకొచ్చారు.


More Telugu News