తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తుంది... ఇప్పట్లో బయటపడే అవకాశాల్లేవు: ప్రపంచ ఆరోగ్య సంస్థ

  • వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలన్న డబ్ల్యూహెచ్ఓ
  • ఐసోలేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని స్పష్టీకరణ
  • లాక్ డౌన్ సడలింపుపై దేశాలు పునరాలోచించుకోవాలని సూచన
కరోనా మహమ్మారికి విరుగుడు వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రమాదం మనల్ని వెన్నంటే ఉంటుందన్న వాస్తవాన్ని గ్రహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అధికార ప్రతినిధి డేవిడ్ నాబర్రో పేర్కొన్నారు. ఈ వైరస్ తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తుందని, ఈ ముప్పు నుంచి ప్రపంచం ఇప్పట్లో బయటపడే అవకాశాలు లేవని స్పష్టం చేశారు.

వైరస్ ఉనికిని ఎప్పటికప్పుడు గుర్తించడం, పాజిటివ్ గా తేలిన వారిని ఐసోలేషన్ లో ఉంచడం అనే ప్రక్రియను నిరంతరం కొనసాగించడమే ప్రస్తుతానికి దీన్ని ఎదుర్కొనే మార్గమని నాబర్రో అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ వచ్చేంతవరకు ప్రపంచ దేశాలన్నీ ఈ విధానాన్ని పాటించక తప్పదని అన్నారు. అనేక దేశాల్లో ప్రజలను ఇళ్లకే పరిమితం చేస్తూ లాక్ డౌన్ ఆంక్షలు విధించారని, ఇప్పుడా ఆంక్షలను సడలించడం అంటే వైరస్ వ్యాప్తికి అవకాశమిచ్చినట్టేనని, ఈ విషయంపై ఆయా దేశాలు మరోసారి ఆలోచించుకోవాలని సూచించారు.


More Telugu News