మే నెలలో అమెరికాలో ఆంక్షల సడలింపు ఉండొచ్చు: అంటువ్యాధుల విభాగం అధిపతి
- కరోనా దెబ్బకు అమెరికా అతలాకుతలం
- స్తంభించిన ఆర్థిక రంగం
- అత్యధిక కరోనా కేసులు అగ్రరాజ్యంలోనే
కరోనా మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలమైంది. లక్షలాది ప్రజలు వైరస్ బారిన పడగా... వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. వైరస్‌పై కాస్త ఆలస్యంగా స్పందించిన ప్రభుత్వం.. దేశ వ్యాప్తంగా ఆంక్షలు విధించింది. దాంతో, జనజీవనంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. ఆర్థిక సంక్షోభం ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాలో ఆంక్షల సడలింపు విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రస్తుత పరిస్థితుల్లో మే వరకు ఆంక్షలు కొనసాగించాలని వైరస్ ఎక్స్‌పర్ట్, అమెరికా అంటువ్యాధుల విభాగం అధిపతి ఆంథోనీ ఫాసీ అభిప్రాయపడ్డారు. అప్పటికి గానీ వ్యాధి తీవ్రత తగ్గే అవకాశం లేదంటున్నారు. అందువల్ల మే వరకు రీఓపెన్ చేయొద్దని సూచించారు. దేశాన్ని ఎప్పుడు రీఓపెన్ చేయాలనేది తన జీవితంలో తీసుకోబోయే అతి పెద్ద నిర్ణయం అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈస్టర్ ఆదివారం నుంచి ఆర్థిక కార్యకలాపాలు మొదలయ్యే అవకాశం ఉందన్నారు. కానీ, ఫాసీ వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికాలో ఆంక్షల సడలింపు ఇప్పట్లో కష్టమే అనిపిస్తోంది.