పెంపుడు కుక్కతో ఆడుకుంటూ, టీ తాగుతూ జపాన్ ప్రధాని వీడియో సందేశం.. ప్రజల ఆగ్రహం
- ఇంట్లోనే ఉండాలన్న షింజో అబేపై జపనీయుల ఆసంతృప్తి
- ఆయన సందేశంపై సోషల్ మీడియాలో సెటైర్లు
- ప్రధాని తీరు దొర పోకడలా ఉందని విమర్శలు
జపాన్ ప్రధాని షింబో అబేపై ఆ దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అబేను ఎగతాళి చేస్తూ సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెడుతున్నారు. ‘మిమ్మల్ని మీరు ఏమనుకుంటారు?’ అని ప్రశ్నిస్తున్నారు. కరోనా కట్టడి కోసం ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని అబే ఇచ్చిన వీడియో సందేశమే దీనికి కారణం. దేశంలో లాక్‌డౌన్ విధించడంతో ప్రజలు బయటికి రాకుండా ఇంట్లోనే హాయిగా ఉండాలని ఓ షార్ట్‌ఫిల్మ్‌ను పోలిన వీడియో సాంగ్‌ను అబే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ వీడియోలో సగం ఫ్రేములో ప్రముఖ సింగిన్ జెన్ హాషినో పాట పాడుతుండగా.. మరో సగం ఫ్రేములో అబే కనిపిస్తారు. అబే పెంపుడు కుక్కలతో ఆడుకోవడం, పుస్తకాన్ని చదవడం, టీ తాగడం, టీవీ చూస్తుండడం వంటి దృశ్యాలతో ఈ వీడియోను ఎడిట్ చేశారు. ప్రజలు కూడా లాక్‌డౌన్‌లో ఇంట్లో ఉల్లాసంగా ఉండాలని చెప్పే ఈ ప్రయత్నం జపనీయులకు నచ్చలేదు. కరోనా దెబ్బకు ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న తమను ఇంట్లో ఆడుతూ పాడుతూ ఎలా ఉండమంటారని అబేపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రధాని తీరు దొర పోకడలను తలపిస్తోందని ఆగ్రహించారు. ‘ప్రజలు తమ మనుగడ కోసం పోరాడుతున్న సమయంలో మీరు ఇలా విలాసవంతమైన వీడియో చూపిస్తారా? అసలు మిమ్మల్ని మీరు ఏమనుకుంటున్నారు?’ అని ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. మరికొందరు మాత్రం అబే సందేశాన్ని సమర్థిస్తున్నారు.