కరోనాపై జగన్ సంధించిన బ్రహ్మాస్త్రమిది... తక్కువ కేసులతో బయటపడతాం: విజయసాయిరెడ్డి
- ఒక్కొక్కరికీ మూడేసి మాస్క్ లు ఇవ్వాలని జగన్ నిర్ణయం
- మొత్తం 16 కోట్ల మాస్క్ ల పంపిణీకి రంగం సిద్ధం
- ఏపీ సురక్షిత రాష్ట్రమవుతుందన్న విజయసాయి
ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ మూడేసి మాస్క్ ల చొప్పున అందించాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఓ బ్రహ్మాస్త్రం వంటిదని, దీంతో కరోనాపై పోరులో అతి తక్కువ ప్రాణ నష్టంతో బయటపడగలమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, ప్రస్తుతం దేశమంతా జగన్ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నదని అన్నారు. సమీప భవిష్యత్తులో రాష్ట్రం అత్యంత సురక్షిత రాష్ట్రంగా నిలుస్తుందని విజయసాయి వ్యాఖ్యానించారు.
"రాష్ట్రంలో ప్రతి పౌరుడికి మూడు మాస్కులు అందజేయాలని సిఎం జగన్ గారు చూపిన మార్గానికి దేశమంతా హర్షం వ్యక్తం చేస్తోంది. 16 కోట్ల మాస్కుల పంపిణీ ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. కరోనాపై బ్రహ్మస్త్రం ఇది. అతితక్కువ ప్రాణ నష్టంతో ఏపీ సేఫెస్ట్ ప్లేస్ అవుతుంది" అని విజయసాయి అభిప్రాయపడ్డారు.