చమురు సంక్షోభానికి తెర... ధరల యుద్ధానికి బ్రేక్
- ఓపెక్, రష్యా, ఇతర దేశాల మధ్య కుదిరిన ఒప్పందం
- రోజుకు 9.7 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తికి అంగీకారం
- పుంజుకున్న చమురు మార్కెట్లు
అంతర్జాతీయంగా నెలకొన్న చమురు సంక్షోభానికి తెరపడింది. దీంతో ధరల యుద్ధానికి బ్రేక్ పడనుంది. కరోనా విపత్తు, లాక్‌డౌన్ కారణంగా అంతర్జాతీయంగా చమురుకు డిమాండ్ గణనీయంగా తగ్గిపోయిన సందర్భంలో ఉత్పత్తిని తగ్గించుకోవాలన్న అంశంలో ఓపెక్, రష్యా దేశాల మధ్య వివాదం నెలకొంది.
ఉత్పత్తిని తగ్గించేందుకు రష్యా అంగీకరించకపోవడంతో దేశాల మధ్య ధరల యుద్ధం కూడా మొదలయ్యింది. దీంతో అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు గణనీయంగా పడిపోయాయి. ఈ విధంగా నష్టపోయిన మొత్తాన్ని ఉత్పత్తిని పెంచడం ద్వారా భర్తీ చేసుకోవాలని ఆయా దేశాలు పోటీపడి మరీ ఉత్పత్తిని పెంచాయి.
దీంతో చమురు ధరలు మరింత పతనమై ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఈ పరిస్థితుల్లో ఓపెక్ దేశాలు, రష్యాతోపాటు ఇతర చమురు ఉత్పత్తి దేశాల మధ్య రాజీ కుదరడం శుభపరిణామంగా పరిశీలకులు భావిస్తున్నారు. రోజుకు గరిష్టంగా 9.7 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తికి అంగీకారానికి వచ్చారు.
నిన్న కుదిరిన తాజా ఒప్పందంతో చమురు మార్కెట్లు పుంజుకున్నాయి. అమెరికా బెంచ్‌మార్క్ సూచీ డబ్ల్యూటీఐ 7.7 శాతం ఎగబాకి బ్యారెల్ ధర 24.52 డాలర్లకు చేరింది. అలాగే బ్రెంట్ ధర ఐదు శాతం లాభపడి 33.08 డార్లకు పెరిగింది.