కనిపించని ఈస్టర్ సందడి... లైవ్ స్ట్రీమింగ్ లో పోప్ సందేశం!

  • ఈస్టర్ వేడుకలపై కరోనా ప్రభావం
  • ఇళ్లకే పరిమితమైన క్రైస్తవులు
  • కరోనా గురించే తన ఆలోచనలన్న పోప్
కరోనా మహమ్మారి ప్రభావం ఈస్టర్ వేడుకలపైనా పడింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా, ఈస్టర్ సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయే చర్చ్ లు, బోసిపోయాయి. ఇటలీ నుంచి పనామా వరకూ ఇదే పరిస్థితి నెలకొంది. క్రైస్తవులంతా, ఇళ్లకే పరిమితమై, ప్రార్థనలు నిర్వహించారు.

ఇక వాటికన్ సిటీలో పోప్ ప్రాన్సిస్ ఈ సంవత్సరం ఈస్టర్ సందేశాన్ని లైవ్ స్ట్రీమింగ్ తో సరిపెట్టారు. నిర్మానుష్యమైన సెయింట్ పీటర్స్ చర్చ్ లో ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రపంచ దేశాలన్నీ కలిసి కరోనా వైరస్ పై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. తన ఆలోచనలన్నీ వ్యాధితో బాధపడుతున్న వారిపైనే ఉన్నాయని వ్యాఖ్యానించిన పోప్, ఎందరో ఈ మహమ్మారికి బలైపోయారని, మరెందరో తమ ప్రియమైన వ్యక్తుల్ని కోల్పోయారని అన్నారు. ఏసు కృపతో త్వరలోనే మహమ్మారిపై ప్రజలు విజయం సాధిస్తారని ఆకాంక్షించారు.


More Telugu News