లాక్ డౌన్ విషయంలో మోదీ ఏదంటే అదే.. స్పష్టం చేసిన యోగి ఆదిత్యనాథ్

  • రేపటితో ముగియనున్న దేశవ్యాప్త లాక్ డౌన్ 
  • ఇప్పటికే లాక్‌డౌన్‌ను పొడిగించిన పలు రాష్ట్రాలు
  • పలు అంశాలకు సంబంధించి కమిటీల ఏర్పాటు
కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు దేశంలో విధించిన లాక్‌డౌన్ గడువు రేపటితో ముగియనుంది. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలపాటు పొడిగించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. చాలా రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రకటించాయి.

 ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమ వైఖరేంటో వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ తీసుకోబోయే నిర్ణయాన్నే రాష్ట్రంలోనూ అమలు చేస్తామని స్పష్టం చేశారు. కాగా, ప్రభుత్వ, ప్రజా సంబంధిత పనులను సామాజిక దూరం పాటిస్తూ ఎలా చేయవచ్చో ఉప ముఖ్యమంత్రి కేశవ్ మౌర్య అధ్యక్షతన నిర్ణయిస్తామని సీఎం తెలిపారు. విద్య, ఆర్థిక, వ్యవసాయం, నీరు, నిర్మాణం తదితర అంశాలకు సంబంధించి కమిటీలను యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.


More Telugu News