ఢిల్లీలో భూకంపం.. ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని కోరుకున్న సీఎం కేజ్రీవాల్

  • ఢిల్లీ- ఎన్సీఆర్ పరిధిలో స్వల్ప భూ ప్రకంపనలు
  • ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలో భూ కంప కేంద్రం గుర్తింపు
  • ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
ఢిల్లీ- ఎన్సీఆర్ పరిధిలో ఈ రోజు సాయంత్రం స్వల్ప  భూకంపం సంభవించింది. ప్రాథమిక నివేదిక ప్రకారం రిక్టర్ స్కేల్ పై  భూకంప తీవ్రత 3.5గా నమోదైంది. సాయంత్రం 5.45 గంటల సమయంలో భూ ప్రకంపనలు సంభవించాయి.

ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. భూప్రకంపనలతో ఇళ్లల్లోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. తమ ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.
 
ఈ ఘటనపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీలో భూ ప్రకంపనలు సంభవించాయని, అందరూ సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నానని అన్నారు. ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.


More Telugu News