ఆపరేటర్ ఎవరైనా ఇక సెట్ టాప్ బాక్సు ఒకటే.. ట్రాయ్ కీలక నిర్ణయం

  • ఒక్కో ఆపరేటర్, ఒక్కో సెట్ టాప్ బాక్సు... ఇప్పటివరకు తీరిదీ!
  • ఇకమీదట ఒకటే బాక్సు
  • వినియోగదారుడు తనకిష్టమైన ఆపరేటర్ ను ఎంచుకునే సౌలభ్యం
దేశంలో బుల్లితెర ప్రేక్షకుల వినియోగార్థం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇప్పటివరకు ఒక్కో డీటీహెచ్ ఆపరేటర్ తమకంటూ ప్రత్యేకమైన సెట్ టాప్ బాక్సులను వినియోగదారులకు ఇస్తుండేవారు. ఇకపై ఆ విధానం పోవాలని, ఆపరేటర్ ఎవరైనా సెట్ టాప్ బాక్సు ఒకటే ఉండాలని ట్రాయ్ నిర్ణయించింది.

ఒకే బాక్సుతో తనకు ఇష్టమైన ఆపరేటర్ ను ఎంచుకునే సౌలభ్యం వినియోగదారుడికి ఉండాలని ట్రాయ్ భావిస్తోంది. ఇకమీదట అలాంటి సెట్ టాప్ బాక్సులనే వినియోగదారులకు ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు జారీచేయాలంటూ ట్రాయ్ సిఫారసు చేసింది. అందుకోసం డీటీహెచ్ కంపెనీలకు ఆర్నెల్ల గడువు ఇవ్వాలని, ఈ సెట్ టాప్ బాక్సులు విధిగా యూఎస్ బీ ఆధారిత కనెక్షన్ తో కూడా పనిచేసేలా ఉండాలని ట్రాయ్ స్పష్టం చేసింది.


More Telugu News