ధోనీ అప్పుడే రిటైర్ అవ్వాల్సింది: అక్తర్

  • ధోనీ రిటైర్మెంటుపై అక్తర్ స్పందన
  • 2019 వరల్డ్ కప్ తర్వాత తప్పుకుని ఉంటే బాగుండేదని వెల్లడి
  • ధోనీ ఎనలేని సేవలు అందించాడని కితాబు
టీమిండియా వికెట్ కీపింగ్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ తన రిటైర్మెంటు వ్యవహారాన్ని ఇంత దూరం ఎందుకు తీసుకువచ్చాడన్న అంశంలో తాను లోతులకు వెళ్లదలుచుకోలేదని, కానీ ధోనీ 2019 వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించి ఉండే బాగుండేదని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు.

ధోనీ వంటి మహోన్నత క్రికెటర్ కు సముచిత స్థాయిలో వీడ్కోలు లభించాలని తాను ఆశిస్తున్నట్టు తెలిపాడు. ధోనీ తన సర్వశక్తులు ఒడ్డి భారత క్రికెట్ కు ఎనలేని సేవలు అందించాడని, గౌరవంగానే ఆట నుంచి తప్పుకోవాలని సూచించాడు. ఈ విషయాన్ని ఎందుకింత పొడిగిస్తున్నాడో అర్థం కావడంలేదని అక్తర్ వ్యాఖ్యానించాడు. తానే గనుక ధోనీ స్థానంలో ఉంటే ఈపాటికి క్రికెట్ కు గుడ్ బై చెప్పేవాడ్నని వెల్లడించాడు.


More Telugu News