లాక్‌డౌన్ కష్టకాలంలో అద్దె ఇంటి యజమాని పెద్దమనసు
- 75 ఇళ్ల వారికి నెల అద్దె మాఫీ
- ఈ మొత్తం దాదాపు రూ.3.4 లక్షలు
- హైదరాబాద్ వాసి దాతృత్వం ఇది
అద్దె ఇంటి ఓనరు అంటే పీల్చుకు తినేవారే కాదు...కాస్త మానవత్వం ఉన్న వారు కూడా ఉంటారని నిరూపించారు హైదరాబాద్‌కు చెందిన కోడూరి బాలలింగం. కరోనా కష్టకాలంలో తన ఇళ్లలో అద్దెకు ఉంటున్న వారి ఈతిబాధలు గమనించి నెల అద్దె మాఫీ చేసి తన పెద్దమనసు చాటుకున్నారు. ఇది ఏదో చిన్న మొత్తం కాదండోయ్. ఏకంగా రూ.3.4 లక్షలు. వివరాల్లోకి వెళితే బాలలింగానికి నగరంలో మొత్తం 75 సింగిల్ బెడ్‌రూం ఇళ్లున్నాయి. ఈ ఇళ్లలో బీహార్ నుంచి వలస వచ్చిన కార్మికులు అద్దెకు ఉంటున్నారు. వీరందరూ ఏప్రిల్‌లో కట్టాల్సిన అద్దె మొత్తాన్ని వద్దని చెప్పేశారు బాలలింగం.
ఈ సందర్భంగా బాలలింగం మాట్లాడుతూ ‘లాక్‌డౌన్ కారణంగా మా ఇళ్లలో అద్దెకు ఉంటున్న వారెవరూ పనుల్లోకి వెళ్లలేదు. ఆదాయం లేక తిండికే ఇబ్బంది పడుతున్నారు. నేను ఇటువంటి ఇబ్బందులు, ఎదురు దెబ్బలు ఎన్నోచూశాను. కష్టాలు, కన్నీళ్లను దిగమింగుకునే ఈ స్థాయికి వచ్చాను. పేదల బాధలు నాకు తెలుసు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని చెప్పారు.
బాలలింగానికి ఇదేమీ కొత్తకాదని, గతంలోనూ ఇటువంటి దాతృత్వ చర్యలు చేపట్టారని చుట్టుపక్కల వారు తెలిపారు. ఈ కష్టకాలంలోనూ తెలుగు రాష్ట్రాల్లోని పేదలకు 2.5 లక్షల సహాయం అందించారని తెలిపారు. హ్యాట్సాఫ్...బాలలింగం.