ఆరోగ్యశ్రీ కార్డు లేదా...చింత వద్దంటున్న పథకం నెల్లూరు జిల్లా కో ఆర్డినేటర్‌

  • సీఎం సహాయ నిధి కింద వైద్యం
  • వ్యాధి వివరాల ధ్రువపత్రం, గుర్తింపు కార్డు ఉంటే చాలు
  • ప్రకటించిన జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ నాగార్జున
ఎవరివద్దయినా ఆరోగ్యశ్రీ కార్డు లేకుంటే చింత అవసరం లేదని, సరైన ఆధారాలతో వస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆయా ఆసుపత్రుల్లో వైద్యం పొందవచ్చునని నెల్లూరు జిల్లా ఆరోగ్యశ్రీ పథకం సమన్వయకర్త డాక్టర్‌ నాగార్జున ప్రకటించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత నూతన విధానం తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు రేషన్‌ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు ఉండేది. ఇప్పుడు రేషన్‌ కార్డును మూడు విభాగాలుగా మార్చి బియ్యం కార్డు, విద్య, వసతి దీవెన, ఆరోగ్యశ్రీగా విభజించారు. కొత్తకార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమయ్యేసరికి కరోనా, లాక్‌డౌన్‌ వచ్చిపడడంతో చాలామందికి కార్డులు అందలేదు.

దీంతో ఆసుపత్రుల్లో వైద్యం అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అనుమతి తెచ్చుకోవాల్సి వచ్చేది. ఇకపై జిల్లా కేంద్రంలోనే అనుమతి తీసుకోవచ్చని చెప్పారు డాక్టర్‌ నాగార్జున . రోగానికి సంబంధించిన ధ్రువపత్రాలు, గుర్తింపు కార్డు పాస్‌పోర్టు ఫొటోతో వస్తే ఉచిత వైద్యానికి అనుమతిస్తామని తెలిపారు.


More Telugu News