నిద్రలేమితో మనిషి భావోద్వేగాలపై తీవ్ర ప్రభావం : పరిశోధనలో వెల్లడి

  • పరిశోధాత్మక కథనం ప్రచురించిన జర్నల్ ఆఫ్ రీసెర్చి
  • గాఢ నిద్రపోయే వారితో పోల్చితే వీరిలో విపరీతమైన తేడా
  • ఐదు రోజులపాటు పరిస్థితిని పరిశీలించి నిర్ణయం
ఆదమరిచి నిద్రపోయే వారి కంటే నిద్రలేమితో సతమతమయ్యే వారిలో భావోద్వేగ సమస్యలు తీవ్రంగా ఉంటాయని పరిశోధకులు గుర్తించారు. ఎంపిక చేసిన కొందరు వ్యక్తులపై పది రోజులపాటు జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడయ్యిందని తేల్చారు. అమెరికా నుంచి ప్రచురితమయ్యే ప్రఖ్యాత జర్నల్ 'జర్నల్ ఆఫ్ స్లీప్' ఇందుకు సంబంధించిన ఓ పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం మేరకు పరిశోధకులు కొందరు వ్యక్తులను ఐదు రాత్రులు గాఢ నిద్రపోయేలా ఏర్పాట్లు చేశారు.

ఉదయం వారి భావోద్వేగాలను పరిశీలించారు. అనంతరం మరో ఐదు రోజులు ఆంక్షలతో (కేవలం ఐదు గంటలు అరకొరగా పడుకునేలా) నిద్రపోయే వారిని ఉదయం పూట పరిశీలిస్తే వారిలోని భావోద్వేగాల్లో అంతుపట్టని తేడాలను పరిశోధకులు గుర్తించారు. 'నిద్రలేమి మనిషి మనస్తత్వంలో వ్యతిరేక భావాలకు, వారి ధోరణిలో తీవ్రమైన మార్పులకు చాలా వరకు కారణమవుతోంది' అని ఆర్టికల్ రచయిత, ఇటలీలోని లాక్విలా యూనివర్సిటీ పరిశోధకురాలు డేనియాలా టెంపెస్టా తేల్చిచెప్పారు.

నిద్రలేమి సమస్య తీవ్రంగా ఉన్న వారిలో తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణమవుతోందని ఆమె గుర్తించారు. ఆధునిక జీవనశైలి మనిషిలో నిద్రలేమికి ఓ కారణం అవుతోందని, అనారోగ్య సమస్యలకు దారితీస్తోందని ఆమె తన పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు.


More Telugu News