కరోనా ఇండియాకు వస్తే శవాల గుట్టలేనన్న వారు ఇప్పుడు నోరెళ్లబెట్టి చూస్తున్నారు: న్యూయార్క్ యువతి స్వాతి వీడియో వైరల్!
- ఇండియాకు, అమెరికాకు తేడా చెప్పిన స్వాతి
- ముందుగా మేల్కొనడం ఇండియాకు లాభించింది
- ఎన్నో దేశాల ప్రశంసలను భారత్ అందుకుందని కితాబు
అభివృద్ధి చెందిన దేశం అమెరికాలో కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితులను, భారత్ లోని పరిస్థితులను పోలుస్తూ, న్యూయార్క్ కు చెందిన స్వాతి అనే తెలుగు యువతి పెట్టిన ఓ ఫేస్ బుక్ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ ను ఇప్పుడు వేలాది మంది షేర్ చేస్తున్నారు.
ఇండియాకు, అమెరికాకు మధ్య తేడాను వివరించిన ఆమె, అగ్రరాజ్యంతో ఆధునిక జీవన విధానానికి, ఇండియాలో పేదరికానికి ఉన్న తేడాను స్పష్టంగా చెప్పారు. కరోనా వైరస్ నియంత్రణలో ఇరు దేశాల విధానాన్ని పోల్చారు. ఇండియా ముందుగానే మేల్కొందని అన్నారు. కరోనా వ్యాధి ఇండియాలో విస్తరిస్తే, శవాల గుట్టలేనన్న దేశాలు, ఇప్పుడు నోరెళ్లబెట్టి చూస్తున్నాయని, ఇప్పుడు భారతావని ఎన్నో దేశాల ప్రశంసలను అందుకుంటోందని, కరోనాకు ఔషధాల కోసం ఎన్నో దేశాలు భారత్ వైపే చూస్తున్నాయని అన్నారు. స్వాతి పెట్టిన వీడియోను మీరూ చూడవచ్చు.