చైనా అభివృద్ధి చెందుతున్న దేశమే అయితే, మాదీ అంతే!: డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు

  • అభివృద్ధి చెందుతున్నామని చెబుతూ ప్రయోజనాలు పొందుతున్న చైనా 
  • ఆ దేశాన్ని 'డెవలపింగ్ కంట్రీస్' లిస్ట్ లో ఉంచడమే కారణం  
  • డెవలపింగ్ కంట్రీస్ కు మంచి ఉదాహరణ ఇండియా
అభివృద్ధి చెందుతున్న దేశాలమన్న సాకుతో పలు దేశాలు పెద్ద మొత్తంలో లాభపడుతూ ఉన్నాయని, ఆ ముసుగులో చైనా కూడా లాభపడుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. తాజాగా వైట్ హౌస్ లో జరిగిన మీడియా కాన్ఫెరెన్స్ లో మాట్లాడిన ఆయన, ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. చైనాను టార్గెట్ చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. చైనా అభివృద్ధి చెందుతున్న దేశమే అయితే, అమెరికా కూడా అభివృద్ధి చెందుతున్న దేశమేనని అన్నారు.

యూఎస్ సహా పలు దేశాల నుంచి చైనా లాభం పొందుతోందని, ఆ దేశాన్ని 'డెవలపింగ్ కంట్రీస్' లిస్ట్ లో ఉంచడమే ఇందుకు కారణమని అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశానికి మంచి ఉదాహరణగా ఇండియాను పేర్కొనవచ్చని ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం. యూఎస్ అభివృద్ధి చెందినదనడంలో సందేహం లేదని, అయితే, అభివృద్ధి చెందిన దేశాలు కూడా, చెందుతున్న దేశాల పేరుతో ప్రయోజనాలు పొందుతున్నాయని నిప్పులు చెరిగారు.


More Telugu News