ఇదో బుజ్జి 'జాంకీ'.. గాడిదకు, కంచర గాడిదకు పుట్టిన అపురూపం!
- కెన్యాలో అసాధారణ జంతువు జననం
- పైభాగం గాడిద, కాళ్ల భాగమంతా చారలు
- వైల్డ్ లైఫ్ ట్రస్ట్ సంరక్షణలో ఉన్న తల్లి, బిడ్డ
ఒక్కోసారి ఈ ప్రకృతిలో మనల్ని ఆశ్చర్యానికి గురిచేసే వింతలు చోటుచేసుకుంటూ వుంటాయి. ఇది కూడా అలాంటిదే. ఆఫ్రికా దేశం కెన్యాలో ఒక కొత్త అసాధారణమైన సంకరజాతి జంతువు జన్మించింది. జీబ్రా (కంచరగాడిద)కు, డాంకీ (గాడిద)కి కలిసి ఓ విచిత్ర జంతువు జన్మించింది.
ఈ బుజ్జి జంతువు చాలా ఆకర్షణీయంగా ఉంది. పైభాగం మొత్తం గాడిద మాదిరి, కాళ్ల భాగం కంచరగాడిద చారలతో ముద్దుముద్దుగా ఉంది. దీంతో, దీనికి అమ్మానాన్నల జాతుల పేర్లు కలిసి వచ్చేలా 'జాంకీ' అని పేరు పెట్టారు. జాంకీ తల్లి జీబ్రా, తండ్రి డాంకీ కావడం గమనార్హం. మరి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
కెన్యాలోని సావో తూర్పు జాతీయ పార్కు నుంచి గతేడాది మే నెలలో ఓ ఆడ జీబ్రా తప్పిపోయి.. స్థానిక మహిళకు చెందిన ఓ గొర్రెల మందలో కలిసిపోయింది. అది గమనించిన సదరు మహిళ షెల్డ్రిక్ వైల్డ్ లైఫ్ ట్రస్ట్ వారిని సంప్రదించి విషయాన్ని వారి చెవిన వేసింది. దాంతో వారొచ్చి ఈ జీబ్రాను తీసుకెళ్లి చిలూ జాతీయ పార్కుకు తరలించారు. అక్కడ ఈ జీబ్రా మిగతా వాటితో బాగానే కలిసిపోయి జీవించడాన్ని పార్కు సంరక్షకులు అప్పుడప్పుడు గమనిస్తూనే వున్నారు.
ఇదిలావుండగా, ఈమధ్య ఈ జీబ్రా పక్కన అక్కడి పనివారికి చిన్న పిల్ల కూడా కనపడింది. మరికొన్ని వారాల తర్వాత చూస్తే.. ఆశ్చర్యపోవడం పార్కు సంరక్షకుల వంతైంది. ఎందుకంటే, జీబ్రా పక్కనున్న పిల్ల జీబ్రా పోలికలు వాళ్లను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. పై భాగమంతా గాడిద పోలికలు, కాళ్ల నుంచి కింది భాగంలో కంచర గాడిద మాదిరి చారలు ఆ పిల్లలో కనిపించాయి.
ఈ పిల్ల జీబ్రా అక్కడి బురదలో ఎక్కడో గంతులేసివుండడం వల్ల పైన బురద అంటుకుని అలా కనపడివుంటుందని ముందు వాళ్లు భ్రమపడ్డారట. తర్వాత బాగా పరిశీలనగా చూశాక వారికి అసలు విషయం అప్పుడర్థమైంది.. ఈ జీబ్రా అమ్మడు ఎవరో గాడిద ప్రియుడితో జత కట్టిందన్న సంగతి!
అసలు ఈ పార్కుకి రావడానికి ముందే జీబ్రా అమ్మడు డాంకీతో సరసాలాడి ఉంటుందని పార్కు సంరక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే, జీబ్రా గర్భధారణ కాలం సుమారు 12 నెలలు. అంటే, అమ్మడు ఈ పార్కుకి రావడానికి ముందే రోమాన్స్ లో పడిందన్న మాట!
ఏమైనా, ఈ జాంకీ బుజ్జిపిల్ల ఇప్పుడు ఓ అసాధారణం.. ఓ అపురూపం!