మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ పొడిగింపు... ప్రధాని, సీఎంల మధ్య ఏకాభిప్రాయం!
- సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్
- లాక్ డౌన్ పొడిగించాలన్న ముఖ్యమంత్రులు
- మోదీ సమ్మతించారంటూ కేజ్రీవాల్ ట్వీట్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో లింక్ ద్వారా సీఎంలతో నిర్వహించిన సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. అనేక రాష్ట్రాల్లో కరోనా తీవ్రతరం అవుతున్న తీరు, ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, కేంద్రం వ్యవహరించాల్సిన తీరుపై ప్రధాని, సీఎంల మధ్య సుహృద్భావపూరిత వాతావరణంలో చర్చ జరిగింది.
ఈ సందర్భంగా మెజారిటీ సీఎంలు లాక్ డౌన్ పొడిగించాలని కోరడంతో రెండు వారాల పాటు లాక్ డౌన్ పొడిగింపుకు ప్రధాని అంగీకారం తెలిపినట్టు వెల్లడైంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా లాక్ డౌన్ పొడిగింపుకు మోదీ సమ్మతించారని, ఆయన సరైన నిర్ణయం తీసుకున్నారంటూ ట్వీట్ చేశారు. కాగా, ఇంతక్రితం ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ ఈ నెల 14తో ముగియనుంది. అక్కడినుంచి పొడిగించిన లాక్ డౌన్ నెలాఖరు వరకు అమల్లో ఉంటుందని తెలుస్తోంది. దీనిపై ప్రధాని మోదీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.