ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 402... గుంటూరు జిల్లాలో ఒక్కసారే 14 కేసులు
- ఏపీలో కొత్తగా 21 కేసులు
- కర్నూలు (82), గుంటూరు (72) జిల్లాల్లో అత్యధిక కేసులు
- కరోనా రహిత జిల్లాలుగా శ్రీకాకుళం, విజయనగరం
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మరింతగా పెరిగింది. కొత్తగా 21 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 402కి చేరింది. తాజాగా గుంటూరు జిల్లాలో అత్యధికంగా 14 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 5 కేసులు బయటపడగా, ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్కో కేసు వెలుగు చూశాయి.
కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో ఆరుగురు మరణించారు. 11 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు నిర్వహించిన పరీక్ష ఫలితాలను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఇప్పటివరకు కర్నూలు (82), గుంటూరు (72) జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదు కావడంతో ఆయా జిల్లాల్లో రెడ్ జోన్ల సంఖ్య కూడా పెరిగింది. ఇక, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు కరోనా రహిత జిల్లాలుగా కొనసాగుతున్నాయి. నేటివరకు ఆ రెండు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.