అలాగేతై ఆంధ్రప్రదేశ్‌ మరింత నష్టపోతుంది: మాజీ మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి

  • రక్షణ పరికరాలు లేవని వైద్యులు బాధపడుతున్నారు
  • వైద్యుల సమస్యలు పరిష్కరించకుండా ఎన్నికలపై దృష్టిపెడుతున్నారు
  • ప్రజలు, రైతుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దృష్టి సారించాలి
  • కక్ష సాధింపు చర్యలు వద్దు
కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరు సరికాదని ఏపీ మాజీ మంత్రి అమర్‌ నాథ్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ సమయంలో ఎన్నికల కమిషనర్‌ మార్పు  అవసరమా? అని ప్రశ్నించారు.

ఇటువంటి మార్పులు చేయడం రాష్ట్రానికి మంచిదా? అని అమర్‌నాథ్‌ రెడ్డి నిలదీశారు. రక్షణ పరికరాలు లేవని వైద్యులు బాధపడుతున్నారని, వైద్యుల సమస్యలు పరిష్కరించకుండా ఎన్నికలపై దృష్టిపెడుతున్నారని ఏపీ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా నష్టపోయిందని, ప్రజలు, రైతుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కక్ష సాధింపు చర్యలు చేపడితే రాష్ట్రం మరింత నష్టపోతుందని ఆయన చెప్పారు. ఇప్పటికైనా అన్న క్యాంటీన్లు తెరచి పేదల ఆకలి తీర్చాలని, ఆర్టీజీని సద్వినియోగం చేసుకుని కరోనాను కట్టడి చేయాలని ఆయన హితవు పలికారు.


More Telugu News