ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగించాలి: వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీని కోరిన కేజ్రీవాల్
- లాక్‌డౌన్ ఎత్తివేయకపోతే మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అంశాలపై చర్చ
- కాసేపట్లో మోదీ ప్రకటన?
- పొడిగించాలనే సీఎంల అభిప్రాయం
దేశంలో కరోనా వైరస్ మరింత విజృంభిస్తోన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో కీలక చర్చలు జరిపారు. లాక్‌డౌన్‌పై ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై ఆయన కాసేపట్లో లేక ఈ రోజు రాత్రి ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
వీడియో కాన్ఫరెన్స్ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. మోదీతో మాట్లాడుతూ లాక్‌డౌన్ ఎత్తివేతపై పలు సూచనలు చేశారు. 'నేను ఓ సూచన చేస్తున్నాను. కరోనా విజృంభణ ఇప్పటికీ ఆగలేదు కనుక ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించాలి' అని కేజ్రీవాల్ అన్నారు.
లాక్‌డౌన్ ఎత్తివేసే అంశంపై అనుసరించాల్సిన వ్యూహాలపై సూచనలు చెప్పాలని మోదీ కోరారు. అలాగే, లాక్‌డౌన్ ఎత్తివేయకపోతే మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అంశాలపై కూడా ఆయన ప్రధానంగా చర్చిస్తున్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్‌డౌన్‌ను పొడిగించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.