మరింత తగ్గిన క్రూడ్‌ ధర: పెట్రో ధరలు తగ్గించని చమురు కంపెనీలు

  • బ్రెంట్ క్రూడాయిల్‌ బ్యారెల్‌ 31.48 డాలర్లు
  • డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర 22.76 డాలర్లు
  • అంతర్జాతీయ మార్కెట్లో గత కొంతకాలంగా తగ్గుదల
  • ఆ స్థాయిలో తగ్గని పెట్రోల్‌, డీజిల్‌ ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్‌ ధర మరింత తగ్గింది. గత కొంతకాలంగా తగ్గుతూ వస్తున్న ధర ప్రస్తుతం బ్యారెల్‌కు 4.14 శాతం తగ్గుదలతో 31.48 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 9.29 శాతం క్షీణతతో 22.76 డాలర్లకు దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతి రోజు సవరిస్తుంటాయి. కానీ దేశీయ ఇంధన ధరలు  స్థిరంగానే కొనసాగుతూ వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఈ రోజు కూడా ఎలాంటి మార్పు కనిపించలేదు.

అమరావతిలో కూడా పెట్రోల్‌ ధర రూ.74.61 వద్ద, డీజిల్‌ ధర కూడా రూ.68.52 వద్ద నిలకడగా ఉంది. విజయవాడలో పెట్రోల్ ధర స్థిరంగా రూ.74.21, డీజిల్ ధర కూడా రూ.68.15 వద్దనే నిలకడగా ఉంది.  హైదరాబాద్‌లో శనివారం లీటరు పెట్రోల్ ధర రూ.73.97 వద్ద, డీజిల్ ధర రూ.67.82 వద్ద స్థిరంగా వున్నాయి. వాణిజ్య రాజధాని ముంబయిలో  పెట్రోల్ ధర రూ.75.30 వద్ద, డీజిల్ ధర కూడా రూ.65.21 వద్ద  కొనసాగుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.69.59 వద్ద, డీజిల్ ధర రూ.62.29 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. నిలకడగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో శుక్రవారం ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 4.14 శాతం తగ్గుదలతో 31.48 డాలర్లకు క్షీణించింది. 


More Telugu News