3 గంటలసేపు కూర్చోబెట్టనున్న 'ఆర్ ఆర్ ఆర్'!
- భారీతనమే ప్రత్యేక ఆకర్షణ
- ప్రధాన పాత్రల ప్రాధాన్యత
- బలమైన సన్నివేశాలతో కట్టిపడేసే రాజమౌళి
రాజమౌళి దర్శకత్వంలో గతంలో వచ్చిన 'బాహుబలి' రెండున్నర గంటలకి పైనే వుంది. 'బాహుబలి 2' విషయానికొస్తే, 10 నిమిషాల తక్కువ 3 గంటల నిడివిని కలిగి వుంది. దాంతో 'రౌద్రం రణం రుధిరం' ఎంత నిడివిని కలిగి ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా 3 గంటల నిడివిని కలిగి ఉండేలా చూస్తున్నారట.
కథాకథనాలు .. బలమైన సన్నివేశాలు .. ప్రధాన పాత్రల ప్రాధాన్యత .. సందర్భానికి తగిన పాటల కారణంగా 3 గంటల నిడివిని కలిగి ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాను తెలుగుతో పాటు వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు. అందువలన ఆయా భాషల నటుల పాత్రలకు కూడా ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. ఇక భారీతనం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ కావడం వలన, నిడివి పెరుగుతుందని అంటున్నారు. మంత్రముగ్ధులను చేయడంలో రాజమౌళి సిద్ధహస్తుడు. అందువలన ప్రేక్షకులు నిడివి గురించి ఆలోచించడం జరగదేమో.