భారత్‌లో 24 గంటల్లో అత్యధికంగా 1,035 కరోనా కేసులు.. మరిన్ని పెరిగిన మరణాలు

  • దేశంలో కరోనా కేసుల సంఖ్య 7,447
  • 24 గంటల్లో దేశంలో 40 మంది మృతి
  • ఆసుపత్రుల్లో 6,565 మంది కరోనా బాధితులు
  • 239 మంది మృతి
భారత్‌లో కరోనా కేసులు, మరణాల సంఖ్య మరింత పెరిగింది. 24 గంటల్లో ఏకంగా 1,035 కేసులు నమోదయ్యాయి. ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో కరోనా కేసుల మొత్తం సంఖ్య 7,447కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.

24 గంటల్లో దేశంలో 40 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 6,565 మంది కరోనా బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. 643 మంది కోలుకున్నారు. 239 మంది ప్రాణాలు కోల్పోయారు.

మహారాష్ట్రలో 1574 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. 188 మంది కోలుకోగా, 110 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత తమిళనాడులో అత్యధికంగా 911 మందికి కరోనా సోకింది. ఢిల్లీలో 903 మంది కరోనా బాధితులున్నారు. 25 మంది కోలుకోగా, 13 మంది ప్రాణాలు కోల్పోయారు.

రాజస్థాన్‌లో 553 మందికి కరోనా సోకగా, తెలంగాణలో 473 మందికి సోకింది. ఉత్తరప్రదేశ్‌లో 431 మంది, హర్యానాలో 177 మందికి కరోనా సోకింది. కేరళలో 364 మంది కరోనా బాధితులున్నారు. లఢక్‌లో 15 మంది, జమ్మూకశ్మీర్‌లో 207 మందికి కరోనా సోకింది.


More Telugu News