ఎన్టీఆర్ .. చరణ్ పాత్రలను ప్రేరేపించే పాత్రలో అజయ్ దేవగణ్
- పోరాట యోధుడిగా అజయ్ దేవగణ్
- తెలుగులో ఆయన చేస్తున్న తొలి చిత్రం
- అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి
'రౌద్రం .. రణం .. రుధిరం' సినిమాలో అజయ్ దేవగణ్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. అయితే ఆ పాత్ర ఎలా ఉంటుంది? ఆ పాత్ర ప్రయోజనం ఏమిటి? అనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. స్వాతంత్య్ర కాంక్షను బలంగా కలిగిన ధీరుడిగానే ఆయన పాత్ర ఉంటుందనేది తాజా సమాచారం.
స్వాతంత్ర్య కాంక్ష .. తిరుగుబాటు ధోరణి .. విప్లవ భావజాలంతోనే ఆయన పాత్ర తెరపై కనిపిస్తుందని అంటున్నారు. అల్లూరి సీతారామరాజు .. కొమరమ్ భీమ్ పాత్రల ఆలోచనా విధానాన్ని ఉద్యమ బాటలో నడిపించేదిగా అజయ్ దేవగణ్ పాత్ర ఉంటుందని చెబుతున్నారు. ఈ పాత్ర ఆయన కెరియర్లోనే చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందని అంటున్నారు. సాధారణంగా ఇతర భాషా చిత్రాలను అజయ్ దేవగణ్ ఒప్పుకోడు. అలాంటి ఆయన ఈ సినిమాను చేయడానికి అంగీకరించాడంటేనే ఆ పాత్ర ఎంతటి ప్రాధాన్యతను సంతరించుకుందన్నది అర్థం చేసుకోవచ్చు.