ఏపీలో 381కి పెరిగిన ‘కోవిడ్’ పాజిటివ్ కేసుల సంఖ్య

  • ఉదయం 9 - రాత్రి 7 ఏడు మధ్య కోవిడ్ పరీక్షలు నిర్వహించాం
  • ఇవాళ కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి
  • పేషెంట్స్ నివాస స్థలాలు ‘రెడ్ అలెర్ట్’ లో వుంచాం  
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగినట్టు ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపింది. ఈరోజు ఉదయం 9 నుంచి రాత్రి 7 ఏడు గంటల వరకు జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 7, తూర్పు గోదావరి లో 5, కర్నూలులో 2, ప్రకాశంలో 2 కేసుల చొప్పున నమోదైనట్టు పేర్కొంది. కొత్తగా నమోదైన 16 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 381 కి పెరిగిందని తెలిపింది.
రాష్ట్రంలో పాజిటివ్ గా నిర్ధారించబడిన పేషెంట్స్ నివాస స్థలాలను ‘రెడ్ అలెర్ట్’ లో ఉంచామని, వారి  కాంటాక్ట్స్ అందరినీ  క్వారంటైన్ కి తరలించటం జరిగిందని ప్రభుత్వం పేర్కొంది.


More Telugu News