మాస్కుల తయారీకి ఉపక్రమించిన తెలంగాణ స్వయం సహాయక బృందాలు..

  • 200 బృందాలకు మాస్కుల తయారీ అప్పగింత
  • 60 లక్షల మాస్కుల లక్ష్యాన్ని అందుకుంటామని మహిళల ధీమా
  • మాస్కుకు రూ.12 చొప్పున చెల్లిస్తున్న జీహెచ్ఎంసీ
పారిశుద్ధ్య కార్మికులకు కరోనా నుంచి రక్షణ కల్పించేందుకు తెలంగాణ సర్కారు చర్యలు తీసుకుంటోంది. వారికి పునర్వినియోగానికి అనువుగా ఉండే మాస్కులు అందించాలని నిర్ణయించింది. ఈ మాస్కుల తయారీ బాధ్యతను స్వయం సహాయక బృందాలకు అప్పగించారు. అర్బన్ కమ్యూనిటీ డెవలప్ మెంట్ లో భాగంగా కుట్టు శిక్షణ పొందిన 200 మహిళా సంఘాలు ఈ మాస్కుల తయారీకి ఉపక్రమించాయి.

భౌతిక దూరాన్ని పాటిస్తూ నలుగురు చొప్పున విడిపోయి మాస్కులు తయారుచేస్తున్నారు. ఈ నెల 8 నుంచి ఇప్పటివరకు 20 వేల మాస్కులు తయారుచేశారు. మరో రెండ్రోజుల్లో 60 వేల మాస్కుల లక్ష్యాన్ని అందుకుంటామని స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలు ధీమా వ్యక్తం చేశారు. కాగా, జీహెచ్ఎంసీ ఒక్కో మాస్కుకు రూ.12 చొప్పున చెల్లించనుంది. ఈ మేరకు స్వయం సహాయక సంఘాలకు రూ.7.20 లక్షలు చెల్లించనుంది.


More Telugu News