ఆ నిధులు వస్తే చిన్న తరహా సంస్థలు బతుకుతాయి... కానీ డెమొక్రాట్లు అడ్డుపడుతున్నారు: ట్రంప్
- అమెరికాలో కరోనా విజృంభణ
- కుదేలైన ఆర్థిక వ్యవస్థ
- డెమొక్రాట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి డెమొక్రాట్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఓవైపు కరోనా భూతం అమెరికన్లను అతలాకుతలం చేస్తుండడం, అక్కడి ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకుల్లో పయనిస్తుండడం ట్రంప్ ను కలవరపాటుకు గురిచేస్తోంది.
ఈ నేపథ్యంలో ఆయన డెమొక్రాట్లపై ఆరోపణలు చేశారు. చిన్నతరహా వ్యాపారాలు కోలుకునేందుకు ఉద్దేశించిన 251 బిలియన్ డాలర్ల నిధులను డెమొక్రాట్లు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఈ నిధులతో చిన్నతరహా వ్యాపార సంస్థలు వారి ఉద్యోగులను అట్టిపెట్టుకునేందుకు వీలవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ నిధుల ప్రధాన ఉద్దేశం అదేనని ఉద్ఘాటించారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాకు భారీ ఆర్థిక పునరుజ్జీవం అవసరమని ట్రంప్ పేర్కొన్నారు. అంతేకాదు, ఆర్థిక వ్యవస్థ కుంగిపోకుండా పేరోల్ ట్యాక్స్ కోతలు ఉండాలని అభిప్రాయపడ్డారు.