కన్నడలోకి రీమేక్ అవుతున్న 'ఎవరు'

కన్నడలోకి రీమేక్ అవుతున్న 'ఎవరు'
  • తెలుగులో హిట్ కొట్టిన 'ఎవరు'
  • అడివి శేష్ పాత్రలో దిగంత్ 
  • 'మేజర్' చేస్తున్న అడివి శేష్
అడివి శేష్ .. రెజీనా ప్రధానమైన పాత్రలను పోషించిన 'ఎవరు' చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆసక్తికరంగా సాగే కథాకథనాలు .. ఆయా పాత్రలను మలచిన తీరు .. ఈ సినిమాకి ప్రధానమైన బలంగా మారాయి. విభిన్నమైన కోణాల్లో కథను ఆవిష్కరించిన తీరుకి ప్రశంసలు లభించాయి. అలాంటి ఈ సినిమాను ఇప్పుడు కన్నడలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తెలుగులో అడివి శేష్ పోషించిన పాత్రను కన్నడలో 'దిగంత్' చేయనున్నాడు. ఇక రెజీనా పాత్రకి ఎవరిని ఎంపిక చేయనున్నారనేది చూడాలి. తెలుగు సినిమాకి పనిచేసిన సాంకేతిక నిపుణులే కన్నడ సినిమాకి కూడా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగులో విజయాన్ని అందుకున్న ఈ కథ, కన్నడలో ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి. ఇక అడివి శేష్ విషయానికొస్తే, మహేశ్ బాబు నిర్మాణంలో ఆయన 'మేజర్' సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది.


More Telugu News