తెలంగాణలో మాస్క్ లు ధరించడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు

  • చాలా మందిలో ‘కరోనా’ సోకినా ఆ లక్షణాలు కనబడటం లేదు
  • ఈ విషయం శాస్త్రీయ అధ్యయనాల ద్వారా వెల్లడి 
  • అందుకే, ప్రజలు మాస్క్ లు ధరించాలి
‘తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి  నిరోధక చర్యల్లో భాగంగా ప్రజలు మాస్క్ లు ధరించడాన్ని తప్పనిసరి చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం చాలా మందిలో ‘కరోనా’ సోకినప్పటికీ వారిలో వ్యాధి లక్షణాలు కనబడటం లేదని, అందుకే, ఇళ్ల నుంచి బయటకు వచ్చే ప్రజలు తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని సూచించింది. జపాన్ లో మాస్క్ లు వినియోగించడం ద్వారా ‘కరోనా’ కేసుల సంఖ్యను తగ్గించుకోగలిగారని గుర్తుచేసింది. రెండు పొరలుగా ఉండే కాటన్ తో చేసిన మాస్క్ ల వినియోగం ఆమోదయోగ్యమని తెలిపింది.


More Telugu News