నేపాల్ ప్రధానితో నరేంద్రమోదీ ఫోన్ సంభాషణ.. కోవిడ్ 19 పరిస్థితిపై చర్చ
- మీ ప్రజలు ధీరోదాత్తులు అని ప్రశంసలు
- సమస్యపై ఉమ్మడి పోరాటానికి నిర్ణయం
- ట్విట్టర్‌లో వెల్లడించిన మోదీ
నేపాల్ ప్రధాని కె.పి.షర్మోలీతో ఈరోజు ఫోన్‌లో సంభాషించినట్లు భారత ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం ప్రపంచమంతా కోవిడ్-19 బారినపడి సతమతమవుతున్న వేళ తమ ఇద్దరి మధ్య ఇదే అంశంపై చర్చ సాగిందని మోదీ వెల్లడించారు.
‘ప్రస్తుతం ఇరు దేశాల్లో కోవిడ్-19 తాజా పరిస్థితులపై చర్చించాం. ఈ కష్టకాలంలో నేపాల్ ప్రజలు వైరస్‌తో ధీరోదాత్తంగా పోరాడుతున్న అంశాన్ని నేను ప్రస్తావిస్తూ ఆ దేశ ప్రజల్ని అభినందించాను. నేపాల్ పట్ల మా స్నేహధర్మాన్ని పాటిస్తాం. విపత్తు ఎదుర్కొంటున్న ఈ సమయంలో పరస్పర సహకారంతో మహమ్మారిని ఉమ్మడిగా ఎదుర్కొందాం అని హామీ ఇచ్చాను' అంటూ మోదీ ట్వీట్ చేశారు.