క్షణికావేశం...భార్య మందలించిందని భర్త ఆత్మహత్య
- సిగరెట్లు తాగుతుంటే వద్దంటూ హెచ్చరించిన భార్య
- యాసిడ్ తాగి ఆత్మహత్య
- మృతుడు ఆర్టీసీ బస్ డ్రైవర్
క్షణికావేశంతో ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిగరెట్ల వ్యసనాన్ని వదులుకోవాలంటూ భార్య మందలించిందన్న కోపంతో ఇంట్లో ఉన్న యాసిడ్ తాగేసి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు...చెన్నై సాలిగ్రామం మదియళగన్కు చెందిన నరసింహన్ (72) ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేసి పదవీ విరమణ పొందాడు.
పిల్లలు వేరే ప్రాంతంలో సెటిల్ కావడంతో దంపతులు ఇద్దరే ఉంటున్నారు. సిగరెట్ అలవాటున్న నరసింహన్కు ఇటీవల తరచూ దగ్గు వస్తుండడంతో అందుకు సిగరెట్లే కారణమని, మానేయాలని భార్య ఒత్తిడి చేసింది. ఈ విషయమై బుధవారం దంపతుల మధ్య గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన నరసింహన్ బాత్రూంకు వెళ్లి యాసిడ్ తాగేశాడు. భర్త ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన అతని భార్య స్థానికుల సాయంతో తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లింది. ఆపస్మారక స్థితిలో ఉన్న భర్తను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.