మంచినీరనుకుని శానిటైజర్ తాగిన అనంతపురం ఆరోగ్య శాఖ అధికారి.. తప్పిన ప్రాణాపాయం

  • స్వల్ప అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి 
  • అనంతపురం జిల్లాలో ఘటన 
  • పరామర్శించిన పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు

అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిల్‌కుమార్‌కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ రోజు ఉదయం ఇంట్లో ఉన్న ఆయన మంచినీరనుకుని పొరపాటున శానిటైజర్ తాగేయడంతో అస్వస్థతకు, గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు అప్రమత్తమై స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఆయనను పరీక్షించిన వైద్యులు ప్రాణాపాయం లేదని, చికిత్స అనంతరం రెండు మూడు గంటల్లో ఇంటికి పంపించి వేస్తామని తెలిపారు. కాగా, సమాచారం అందుకున్న పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి డీఎంహెచ్ఓను పరామర్శించారు.



More Telugu News