ఏపీలో మరిన్ని కరోనా కేసులు.. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 75 కేసులు
- 12 గంటల్లో అనంతపురం జిల్లాలో 2 కేసులు
- ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 365
- 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 17 కేసులు
- గుంటూరు జిల్లాలో మొత్తం 51, నెల్లూరు జిల్లాలో 48 కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగింది. ఏపీలో నిన్న రాత్రి 9 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు జరిగిన కొవిడ్-19 పరీక్షల్లో అనంతపురం జిల్లాలో కొత్తగా 2 కేసులు నమోదయ్యాయని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కొత్తగా నమోదైన 2 కేసులతో కలిపి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 365కి పెరిగిందని తెలిపింది.
కాగా, గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కొత్త కేసులను పరిశీలిస్తే మొత్తం 892 కొవిడ్-19 పరీక్షల్లో 17 కేసులు పాజిటివ్‌గా తేలాయి. నమోదైన మొత్తం 365 పాజిటివ్ కేసుల్లో ఇప్పటివరకు 10 మంది డిశ్చార్జ్ కాగా, ఆరుగురు మరణించారు.
ఆసుపత్రుల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 349గా ఉంది. ఇక కర్నూలు జిల్లాలో అత్యధికంగా 75 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 51, నెల్లూరు జిల్లాలో 48, ప్రకాశం జిల్లాలో 38, కృష్ణా జిల్లాలో 35 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఏయే జిల్లాలో ఎన్నెన్ని కేసులు? ఎంతమంది కోలుకున్నారు?