'సాహో' దర్శకుడికి 'లూసిఫర్' రీమేక్ బాధ్యతలు అప్పగించిన చిరూ
- మలయాళంలో హిట్ కొట్టిన 'లూసిఫర్'
- చరణ్ చేతికి తెలుగు రీమేక్ హక్కులు
- తెలుగు వెర్షన్ స్క్రిప్ట్ పై కసరత్తు
మలయాళంలో క్రితం ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'లూసిఫర్' సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ మోహన్ లాల్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. దాంతో ఈ సినిమాను చిరంజీవితో తెలుగులో రీమేక్ చేయాలనే ఉద్దేశంతో రీమేక్ హక్కులను చరణ్ సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఈ రీమేక్ దర్శకత్వ బాధ్యతలను ఎవరికి అప్పగించనున్నారనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది.
ఒక దశలో వినాయక్ పేరు వినిపించింది. కానీ ఈ రీమేక్ బాధ్యతలను సుజీత్ కి అప్పగించినట్టుగా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి చెప్పారు. తెలుగు వెర్షన్ కి తగినట్టుగా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేయడంలో సుజీత్ బిజీగా వున్నాడని ఆయన అన్నారు. 'సాహో' వంటి భారీ బడ్జెట్ చిత్రంతో సుజీత్ దర్శకుడిగా తన సత్తా చాటుకున్నాడు. తెలుగులో ఈ సినిమా ఆశించిన స్థాయికి వెళ్లకపోయినా, బాలీవుడ్లో భారీ విజయాన్నే సాధించింది. చిన్న వయసులోనే భారీ చిత్రాన్ని హ్యాండిల్ చేసిన ఆయన టాలెంట్ ను గుర్తించే చిరంజీవి ఈ రీమేక్ బాధ్యతలను ఆయనకు అప్పగించారని అనుకోవాలి.