మగ శిశువుకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు

  • తమిళనాడులోని తంజావూరులో ఘటన
  • సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీసిన వైద్యులు
  • శిశువు రక్త నమూనాలు ల్యాబ్‌కు
కరోనా వైరస్‌తో పోరాడుతున్న ఓ మహిళ పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. తమిళనాడులోని తంజావూరులో జరిగిందీ ఘటన. స్థానిక సుందరంనగర్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తి ఇటీవల ఢిల్లీలో జరిగిన సదస్సుకు వెళ్లొచ్చాడు. విషయం తెలిసిన అధికారులు కుటుంబ సభ్యులను క్వారంటైన్ చేశారు. వారికి నిర్వహించిన పరీక్షల్లో అతడితోపాటు నిండు గర్భిణి అయిన అతడి భార్యకు కూడా కరోనా వైరస్  సోకినట్టు నిర్ధారణ అయింది.

ఇక బుధవారం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో తంజావూరులోని రాజా మిరాసుదార్‌ ఆస్పత్రిలో చేర్పించి సిజేరియన్ ద్వారా బిడ్డను బయటకు తీశారు. అనంతరం తల్లీబిడ్డలను వేర్వేరు వార్డులకు తరలించి పర్యవేక్షిస్తున్నారు. శిశువు రక్త నమూనాలను పరీక్షల కోసం పంపినట్టు వైద్యులు తెలిపారు. శిశువుకు కరోనా సోకిందీ, లేనిదీ రిపోర్టుల్లో తేలుతుందని, వాటి కోసం వేచి చూస్తున్నట్టు చెప్పారు.


More Telugu News