తన పాటను రీమిక్స్ చేయడంపై ఏఆర్ రెహమాన్ ఆగ్రహం!
- 'ఢిల్లీ 6' కోసం "మసక్కలీ... మసక్కలీ..." పాట
- దాన్ని రీమిక్స్ చేసిన తనిష్క్ బగ్చి
- ఒరిజినల్ పాటలే వినాలన్న రెహమాన్
కొన్నాళ్ల క్రితం వచ్చిన 'ఢిల్లీ 6' బాలీవుడ్ సినిమాలోని "మసక్కలీ... మసక్కలీ..." పాట గుర్తుందా? అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచి, సినిమాపై అంచనాలను పెంచేసింది. తాజాగా 'మసక్కలీ 2.0' పేరిట సంగీత దర్శకుడు తనిష్క్ బగ్చి దీన్ని రీమిక్స్ చేయడం ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కు ఆగ్రహాన్ని తెప్పించింది. గతంలో తనకు రీమిక్స్ పాటల సంస్కృతి నచ్చదని బహిరంగంగానే చెప్పిన రెహమాన్, ఈ సారి ఒకింత ఆగ్రహంతో సోషల్ మీడియాలో స్పందించారు.
తన ట్విటర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, ‘ఒరిజినల్ పాటలనే విని ఆనందించండి' అని వ్యాఖ్యానించారు. దీనికి ఓ చిన్న లెటర్ ను జత చేస్తూ, "ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపి పాటలను రాసి, అది నచ్చకుంటే మళ్లీ రాస్తారు. దాదాపు 200 మంది సంగీత కళాకారులు 365 రోజులు గొప్ప సంగీతాన్ని అందించాలని కృషి చేస్తేనే తరాలు నిలబడే పాట పుడుతుంది" అన్నారు. ఆపై "కోపాన్ని నియంత్రించుకునేవారే నిజమైన మనిషి" అంటూ ఓ ఫొటోను కూడా ఆయన షేర్ చేశారు.