అమెరికాలో అమాంతం పెరిగిన నిరుద్యోగం.. భృతి కోసం 1.66 కోట్ల మంది దరఖాస్తు
- రోడ్డున పడుతున్న లక్షలాదిమంది
- నిరుద్యోగ భృతి కోసం క్యూ
- ఈ నెలలో మరో 2 కోట్ల ఉద్యోగాలకు ఎసరు
అమెరికాలో కరోనా వైరస్ విలయానికి లక్షలాది మంది నిరుద్యోగులుగా మారి రోడ్డున పడుతున్నారు. గత మూడు వారాల వ్యవధిలో ప్రతీ పదిమందిలో ఒకరు ఉద్యోగం కోల్పోతున్నారు. 1948 తర్వాత అమెరికాలో ఇదే అతి పెద్ద ఉద్యోగ సంక్షోభం. ఇక, ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగులుగా మారుతున్నవారు నిరుద్యోగ భృతి కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. గత వారం ఏకంగా 66 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా గత మూడువారాల్లో ఇలా దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 1.66 కోట్లకు చేరుకోవడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
కరోనా వైరస్ ప్రబలడంతో అమెరికాలో చాలా సంస్థలు మూతపడ్డాయి. ఈ నెలలో మరో 2 కోట్ల మంది అమెరికన్ల ఉద్యోగాలకు ఎసరు తప్పదని అంచనా. ఆదాయం లేక విలవిల్లాడుతున్న రెస్టారెంట్లు, హోటళ్లు, డిపార్ట్‌మెంట్ స్టోర్లు, చిన్నాచితక వ్యాపారులు ఉద్యోగులను భరించలేక ఇంటికి సాగనంపుతున్నాయి.