బిల్ క్లింటన్, మోనికా గుట్టు బయటపెట్టిన పెంటగాన్ మాజీ ఉద్యోగిని మృతి
- అప్పట్లో సంచలనం సృష్టించిన క్లింటన్, లూయిన్ స్కీ ప్రణయం
- రహస్యంగా రికార్డు చేసిన లిండా ట్రిప్
- పాంక్రియాటిక్ క్యాన్సర్ తో లిండా ట్రిప్ కన్నుమూత
అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బిల్ క్లింటన్ 90వ దశకంలో వైట్ హౌస్ ఉద్యోగిని మోనికా లూయిన్ స్కీతో సాగించిన సరస సల్లాపాలు ఓ మహిళా ఉద్యోగిని కారణంగా బట్టబయలయ్యాయి. ఆమె పేరు లిండా ట్రిప్. లిండా గతంలో అమెరికా రక్షణ శాఖలో పబ్లిక్ అఫైర్స్ విభాగంలో అధికారిగా పనిచేశారు. ఇప్పుడామె అనారోగ్యం కారణంగా మృతి చెందారు.
లిండా ట్రిప్ కొంతకాలంగా పాంక్రియాటిక్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో లిండా బుధవారం మరణించారని ఆమె మాజీ న్యాయమూర్తి జోసెఫ్ ముర్తా వెల్లడించారు. బిల్ క్లింటన్ తో సాగించిన రాసలీలను గురించి మోనికా లూయిన్ స్కీ వివరించడాన్ని అప్పట్లో లిండా ట్రిప్ రహస్యంగా రికార్డు చేశారు. ఈ ఆడియో టేపులతో క్లింటన్ పరువు మంటగలిసింది. ఈ నేపథ్యంలో, లిండాను డెమొక్రాట్లు ఓ విలన్ గా చూడగా, రిపబ్లికన్లు మాత్రం ఆకాశానికెత్తేశారు.