ఉగాండా అధ్యక్షుడికి ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
- దాదాపు అన్ని దేశాలకు పాకిన కరోనా వైరస్
- కరోనా కట్టడిపై ఉగాండా అధ్యక్షుడితో ఫోన్ లో చర్చించిన మోదీ
- అన్ని విధాలా సాయమందిస్తామని హామీ
కరోనా మహమ్మారి విసురుతున్న సవాళ్లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగాండా దేశాధ్యక్షుడు యోవెరి ముసెవినితో చర్చించారు. మోదీ ఇవాళ ముసెవినితో ఫోన్ లో కరోనా వ్యాప్తి, సహాయక చర్యలపై మాట్లాడారు. ఉగాండాలో కరోనా నివారణ చర్యల కోసం భారత్ అన్నివిధాలుగా సాయపడుతుందని మోదీ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కరోనా కారణంగా ఉత్పన్నమవుతున్న ఆరోగ్య, ఆర్థిక సమస్యలపై ఇరువురు నేతలు చర్చించారు.