అర్చకులకు ఆర్థిక సాయంపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం
- చిన్న ఆలయాల్లో పని చేసే అర్చకులకు ఆర్థిక సాయం
- ఒక్కొక్కరికి రూ. 5 వేల సాయం
- జగన్ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నామన్న మంత్రి వెల్లంపల్లి
కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న అర్చకులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చిన్న ఆలయాల్లో పని చేసే అర్చకులకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. అర్చక వెల్ఫేర్ ఫండ్ ద్వారా ఒక్కొక్క అర్చకుడికి రూ. 5 వేల చొప్పున సాయం అందించనున్నట్టు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.
ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న అర్చకులను ఆదుకోవాలంటూ సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ నెల 14 వరకు దేవాలయాల్లో భక్తులను అనుమతించమని తెలిపారు. ఆలయాల్లో ప్రతి రోజు నిత్య పూజలు జరుగుతున్నాయని చెప్పారు.