సచిన్ లో అంత సంతోషాన్ని ఎప్పుడూ చూడలేదు: హర్భజన్ సింగ్
- 2011 ప్రపంచకప్ ఫైనల్ ముచ్చట్లు చెప్పిన భజ్జీ
- సచిన్ డ్యాన్స్ చేయడాన్ని ఆరోజే చూశానని వెల్లడి
- ప్రతి ఒక్కరితో ఆనందాన్ని పంచుకున్నాడంటూ వ్యాఖ్యలు
భారత క్రికెట్ చరిత్రలో 2011 వరల్డ్ కప్ ఓ మధురానుభూతి. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని టీమిండియా ముంబయి వాంఖెడే స్టేడియంలో జరిగిన ఫైనల్లో శ్రీలంకను చిత్తుచేసి వరల్డ్ కప్ అందుకుంది. ఈ విజయం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కెరీర్ లో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది.
ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం ఏం జరిగిందో నాటి జట్టులో సభ్యుడైన హర్భజన్ సింగ్ తాజాగా వివరించాడు. "సచిన్ డ్యాన్స్ చేయడాన్ని ఆ రోజే మొట్టమొదటిసారి చూశాను. చుట్టూ ఎవరున్నారో కూడా పట్టించుకోనంతగా సచిన్ సంతోష సాగరంలో తేలియాడాడు. ప్రతి ఒక్కరితో తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను" అంటూ వెల్లడించాడు. శ్రీలంకతో ఫైనల్ లో గెలిచాక నాటి టీమిండియా సభ్యులు సచిన్ ను భుజాలపైకి ఎత్తుకుని స్టేడియం అంతా కలియదిరిగారు.